తమిళ దర్శకుడితో బాలయ్య!

నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాతో విజయం అందుకున్నారు. ఈ సినిమా తన కెరీర్ లో గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. తన వందో సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న బాలయ్య ఇప్పుడు ఇప్పుడు తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. ఈ క్రమమో
కృష్ణవంశీ పేరు బాగా వినిపించింది.

‘రైతు’ కథతో బాలయ్య సెట్స్ పైకి వెళ్తారని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అసలు కృష్ణవంశీతో బాలయ్య సినిమా ఉంటుందా..? అనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తాజాగా మరో వార్తా వెలుగులోకి వచ్చింది. గతంలో రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసి హిట్స్ సంపాదించిన దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయనున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యే రవికుమార్ బాలయ్యను కలిసి ఓ లైన్ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. అది ఆయనకు నచ్చడంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. మరి బాలయ్య ఎవరితో సెట్స్ పైకి వెళ్తాడో.. చూడాలి!