‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ‘ఎన్టీఆర్’ పాత్రపై మరో రూమర్‌!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ..మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ముల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. రాజామౌళి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జ్‌ట్‌ సినిమా టైటిల్ ఏంటనే విషయం ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. ఆర్ఆర్ఆర్ అన్నది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మినహా ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు అనే విషయం బయటకు రావడం లేదు. పైగా ఇందులో ఎన్టీఆర్ కొత్తగా కనిపించబోతున్నాడని మాత్రం తెలియడంతో ఆయన పాత్రపై అనేక పుకార్లు మీడియాలో వస్తున్నాయి.

తాజాగా మరో రూమర్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ భారీ కాయంతో.. ఓ ముస్లిం యువకుడిగా కనిపిస్తున్నడని బందిపోటు గెటప్ లో ఉంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. స్వాతంత్రానికి ముందుకాలం నాటి కథతో సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తున్నది. ఎన్టీఆర్ ను పట్టుకోవడానికి బ్రిటిష్ అధికారిగా చరణ్ కనిపిస్తాడని.. ఇద్దరి మధ్య జరిగే పోరాట సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉండనే విషయం తెలియడంలేదు.