‘ఆర్‌ఎక్స్ 100’ దర్శకుడికి కరోనా

దేశంలో కరోనా విజృంభిస్తుంది. చిన్న, పెద్ద ఎవరిని వదలడం లేదు. అయితే టాలీవుడ్‌లో కూడా కరోనా తన ప్రభావం చుపిస్తుంది. ఇంతక ముందు టాలీవుడ్ లో డైరెక్టర్‌ రాజమౌళి అలాగే ఆయన కుటుంబం అందరు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇక వారికి తాజాగా చేసిన కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చింది. మరో టాలీవుడ్ దర్శకుడు దాని బారిన పడ్డాడు. ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్‌ అజయ్ భూపతి. ఇప్పడు ఆయనకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ వేదికగా ”వచ్చేసింది” అంటూ తెలిపాడు. అలాగే కరోనా నుండి కోలుకొని ”త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా” అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అందులో శర్వానంద్ ఫిక్స్ కాగా మరో హీరో కోసం వెతుకుతున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates