HomeTelugu Trendingనాగ చైతన్య తో ఫిదా బ్యూటీ!

నాగ చైతన్య తో ఫిదా బ్యూటీ!

4 16యంగ్‌ హీరో నాగ చైతన్య ‘మజిలీ’ సినిమా విజయంతో వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘వెంకీ మామ’లో నటిస్తున్న ఆయన దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా, మేర్లపాక గాంధీ డైరెక్షన్లో ఇంకో సినిమా ఒప్పుకుని ఉన్నారు. ఈ రెండూ కాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని చైతూ అనుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

‘ఫిదా’ తరవాత కొత్త వాళ్లతో ఒక ప్రాజెక్ట్ సెట్ చేసిన శేఖర్ కమ్ముల ఆ సినిమా మొదలవడానికి ఇంకా కొంత సమయం పడుతుంది కాబట్టి ఈలోపు చైతన్యతో ఒక సినిమా చేసేయాలని, అందులో సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నారట. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్టైతే అన్ని విధాలా కొత్తగా ఉంటుంది. మరి ఇది కుదురుతుందో లేదో తెలియాలంటే కమ్ముల లేదా చైతూల్లో ఎవరో ఒకరి నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ అందేవరకు ఎదురుచూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu