HomeTelugu Trendingమహా సముద్రంలో అను ఇమ్మాన్యుయేల్

మహా సముద్రంలో అను ఇమ్మాన్యుయేల్

Anu emmanuel In Maha Samud
డైరెక్టర్‌ అజయ్ భూపతి ఇటీవలే ”మహా సముద్రం” ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన ప్రకటన ఇచ్చింది చిత్రబృందం. ఈ భారీ మల్టీస్టారర్ లో అను ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్ గా నటించనుందని ప్రకటించారు.

ఈ సినిమాలో అందరికి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను క్రియేట్ చేసిన అజయ్ భూపతి.. అను ఇమ్మాన్యుయేల్ కి కూడా ఒక ముఖ్యమైన పాత్రను ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో టాలెంటెడ్ హీరోయిన్ అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించబోతుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.

తరుణ్ భాస్కర్‌తో క్లాప్‌బోర్డు ఇంటర్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu