HomeTelugu Trendingఏడేళ్లల తరువాత సిద్ధార్థ్‌ రీ ఎంట్రీ

ఏడేళ్లల తరువాత సిద్ధార్థ్‌ రీ ఎంట్రీ

Siddharth acting in teluguహీరో సిద్ధార్థ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ తదితర ఎన్నో చిత్రాల్లో నటించి, మెప్పించాడు. గత ఏడేళ్లుగా తెలుగు పరిశ్రమకు దూరంగా ఉన్నాడు. కొన్ని తమిళ అనువాద చిత్రాల్లో కనిపించినా… పెద్దగా హిట్ సాధించలేకపోయాడు. ఈ క్రమంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నాడు.

ఆర్ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. శర్వానంద్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ మరో హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సుంకర రామబ్రహ్మం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ తమ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. సిద్ధార్థ్ కు సంబంధించి వీడియోను పోస్ట్‌ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu