
Shah Rukh Khan MET Gala 2025:
ఈసారి మెట్ గాలా ఈవెంట్‌కి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హాజరుకానున్నాడన్న వార్త అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని తెచ్చింది. ఇది ఆయనకి మెట్ గాలాలో మొదటి హాజరు కావడం విశేషం. ఇంకా స్పెషల్ విషయం ఏంటంటే… షారుఖ్ లుక్‌ను none other than ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముకర్జీ డిజైన్ చేయబోతున్నాడు.
ఇతన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇచ్చిన “King Khan – Bengal Tiger” అనే నాలుగు పదాల టీజర్‌తోనే సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది. ఇదే ఆయన లుక్ కు సంబంధించి ఒక క్లూ అన్నమాట. సబ్యసాచి డిజైన్స్ అంటే భారతీయ సంస్కృతిని, ఖద్దరు అందాన్ని మిళితం చేసిన స్టైల్. ఇది షారుఖ్ స్టైల్‌కు కూడా చాలా సూట్ అవుతుంది.
View this post on Instagram
‘బెంగాల్ టైగర్’ అనే థీమ్‌తో వస్తున్న ఈ లుక్‌లో షారుఖ్ ఖాన్ రాయల సౌందర్యాన్ని, ఆధునిక ఫ్యాషన్‌ను కలిపినట్టుండబోతోంది. ఎంబ్రాయిడరీ వర్క్, గంభీరమైన డిజైన్స్, అద్భుతమైన జ్యువెలరీతో SRK మెట్ గాలా రেড్ కార్పెట్‌ను తళుక్కున మెరిపించబోతున్నాడు.
ఇంతలో సబ్యసాచి తన తాజా జ్యువెలరీ ‘Rouge Bengal Tiger Bracelet’ను విడుదల చేశాడు. 18 కెరట్ గోల్డ్‌తో తయారైన ఈ బ్రేస్‌లెట్‌లో 30.32 క్యారెట్ల రుబెలైట్, 138 క్యారెట్ల పైన టూర్‌మలైన్స్, రూబీస్, రోడోలైట్స్, డైమండ్స్ ఉన్నాయి. ఈ లుక్‌లో ఇదీ భాగమవుతుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్.
ఈ సంవత్సరం మెట్ గాలా ఈవెంట్‌లో షారుఖ్‌తో పాటు కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా, దిల్జీత్ దోసాంజ్ కూడా పాల్గొంటున్నారు. ఇండియన్ టచ్‌తో ఈవెంట్‌లో ఎలక్ట్రిక్ ప్రెజెన్స్ తీసుకురానున్నారు.
“బెంగాల్ టైగర్” రాత్రి మెట గాలా రేడ్కార్పెట్‌పై నడుస్తున్నప్పుడు, ప్రపంచం మొత్తం కళ్ళు తిప్పుకోకుండా చుస్తుంది అని అభిమానులు ఇప్పటినుండే చెప్పుకుంటున్నారు.
ALSO READ: Akshay Kumar తో 17 ఏళ్ల తర్వాత సినిమా చేయనున్న స్టార్ హీరో