సచిన్, ధోనిలలో గెలిచేదేవరు..?

ఇండియన్ క్రికెట్ లో ఇద్దరు టాప్ హీరోలు సచిన్, ధోని. భారతరత్న స్థాయికి సచిన్ ఎదగగా..
టీం ఇండియాను రెండు సార్లు గెలిపించి సూపర్ కెప్టెన్ గా పేరు గాంచాడు ధోని. అయితే ఇప్పుడు
వీరిద్దరు వెండితెరపై పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరి బయోపిక్స్ తో సినిమాలు వస్తున్నాయి.
జేమ్స్ ఎర్క్సిన్ దర్శకత్వంలో సచిన్ ఆత్మకథ సినిమాగా రూపొందనుంది. ఈ సినిమాలో సచిన్
హీరోగా కనిపించనున్నారు. అలానే నీరజ్ పాండే దర్శకత్వంలో ధోని ఆత్మ కథను సినిమాగా
ధోనినే నిర్మిస్తున్నారు. సచిన్, ధోనిల జీవితలను పోలిస్తే… సచిన్ కంటే ధోని జీవితంలో సినిమాకు
కావల్సిన ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓ సాధారణ కుర్రాడు టీం ఇండియా కెప్టెన్ గా ఎలా
మరాడనేది కీలక అంశం. ఇలాంటి మలుపులు సచిన్ జీవితంలో పెద్దగా కనిపించవు. ఈ రెండు
చిత్రాలు కూడా రెండు నెలల గ్యాప్ లో విడుదల కానున్నాయి. మరి వీరిద్దరిలో గెలిచేది ఎవరో
తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే!

CLICK HERE!! For the aha Latest Updates