‘గల్లీ బాయ్’ పై సాయి ధరమ్ తేజ్‌ స్పందన

బాలీవుడ్‌ హీరో రణ్వీర్ సింగ్‌ నటించిన ‘గల్లీ బాయ్’ సినిమా ఎంతటి హిట్టయ్యిందో తెలిసిందే. రాపో నేపథ్యంలో సాగిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అలియా భట్ నటన కూడా అద్భుతం. ఒక లాంగ్వేజ్ లో హిటైన సినిమాను మరో లాంగ్వేజ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు ‘గల్లీ బాయ్’ సినిమాను కూడా టాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. గీత ఆర్ట్స్ సంస్థ దీని హక్కులను తీసుకుందని, సాయి ధరమ్ తేజ్ తో ఈ సినిమా చేస్తోందని వార్తలు వచ్చాయి.

వీటిపై సాయి ధరమ్ తేజ్ స్పందించారు. గల్లీ బాయ్ సినిమాను ఇప్పటి వరకు చూడలేదని.. తన దగ్గరకు స్క్రిప్ట్ వస్తే తప్పకుండా వింటానని.. బాగుంది అనిపిస్తే చేస్తానని అంటున్నాడు. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రలహరి సినిమా ఏప్రిల్ 12 వ తేదీన భారీ ఎత్తున విడుదల కాబోతున్నది. ఫెయిల్యూర్ యువకుడి స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. మరి ఈ అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే వేచి చుడాల్సిందే.