సూపర్ స్టార్‌ తో సాయి పల్లవి!

టాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న నటి సాయిపల్లవి తన అభినయంతో అందరినీ ఆకట్టుకుంటూ, టాలెంట్‌తో అవకాశాలను అందిపుచ్చుకుంటూ వస్తోంది. మలయాళంలో ‘ప్రేమమ్’తో మలర్‌గా పాపులర్ అయిన.. సాయి పల్లవి, తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’తో అందరినీ ఫిదా చేసేసింది. ఆ సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది ఈ భామ. హిట్‌తో తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకుంది సాయిపల్లవి. అంతేకాకుడా..తమిళంలో కూడా ఇరగదీస్తోంది. ఈ మధ్య రౌడి బేబిగా ప్రపంచ, తమిళ ప్రేక్షకుల్నీ తన డాన్స్‌తో అలరించింది.

అయితే తాజగా సాయిపల్లి మహేశ్ బాబు 26వ సినిమాలో నటించనున్నదని సమాచారం. ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చేస్తున్న విషయం తెలిసిందే. తన 26వ సినిమాను ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. అందులో భాగంగా..దానికి సంబంధించిన ప్రీప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా సాయిపల్లవి ని తీసుకోవాలని అనుకుంటోంది మూవీ యూనిట్‌. అందులో భాగంగా.. ఈ సినిమా గురించి ఆమెతో మాట్లాడడానికి అనిల్ రావిపూడి చెన్నైకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.