
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ సినిమాతో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది. మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ రోజు సైఫ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన లుక్ ను విడుదల చేశారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ లో లాంగ్ హెయిర్ తో సైఫ్ డిఫరెంట్ లుక్ లో ఉన్నారు. సైఫ్ పాత్ర పేరు ఈ సినిమాలో ‘భైరా’ అని మేకర్స్ తెలిపారు.
సముద్ర నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అందుకు ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తరువాత నటిస్తున్న సినిమా కావడం ఒకటైతే.. జాన్వీ కపూర్ ఎంట్రీ మరోకటి. ఇక ఈ సినిమాలో తారగణం కూడా ఓ రెంజ్‌లో ఉంటుంది అని టాక్. ఇక షార్క్ ఫైట్, భారీ సీన్స్ తదితర అంశాలు ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరోవైపు సైఫ్ లుక్ ను షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్… ‘హ్యాపీ బర్త్ డే సైఫ్ సార్’ అని ట్వీట్ చేశారు.
BHAIRA
Happy Birthday Saif sir !#Devara pic.twitter.com/DovAh2Y781
— Jr NTR (@tarak9999) August 16, 2023













