ఘనంగా సైనా వివాహ విందు..

బ్యాడ్మింటన్‌ ప్రేమ జంట సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం హైటెక్‌ సిటీలోని హెచ్‌ఐసీసీ నొవాటెల్‌ హోటల్లో వివాహ విందు ఘనంగా జరిగింది. నీలి రంగు వస్త్రాల్లో నవ దంపతులు కాంతులీనారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎంపీ కవిత, హోం మంత్రి మహమూద్‌ అలీ, సినీ నటుడు నాగార్జున, అమల, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మంచు లక్ష్మీ, షట్లర్లు కిదాంబి శ్రీకాంత్‌, అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి తదితరులు ఈ విందులో పాల్గొన్నారు. కాగా, నిరాడంబరంగా సాగిన సైనా, కశ్యప్‌ల వివాహ వేడుకకు ఇరువైపుల నుంచి అతి కొద్ది మంది బంధువులు మాత్రమే హాజరయ్యారు.