HomeTelugu Trending'సైనా' ట్రైలర్‌

‘సైనా’ ట్రైలర్‌

saina trailer
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బ‌యోపిక్ సినిమా ‘సైనా’ ట్రైల‌ర్ రిలీజైంది. ఈ రోజు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సందర్భంగా ఈ ట్రైలర్‌ విడుదల చేశారు. ‘దారిలో వెళ్ల‌డం ఒకటైతే దారి చూప‌డం అనేది మ‌రొక‌టి.. నువ్వు ఆ రెండోదానిపై దృష్టి సారించు’ అని సైనాకు త‌న త‌ల్లి చెప్పే మాట‌ల‌తో ట్రైలర్‌ ప్రారంభం కాగా సైనా పాత్ర‌లో ప‌రిణీతి నటనతో ఆకట్టుకుంది. సైనా పాత్ర‌లో ప‌రిణీతి చోప్రా ఒదిగిపోయింది. కాగా సైనా లాంటి ఫిట్నెస్ సాదించేందుకు ప‌రిణీతి చోప్రా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అమోల్ గుప్తే డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా టీ సిరీస్ ఫిలింస్, ఫ్రంట్ ఫుట్ పిక్చర్స్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటుంది. మార్చి 26న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu