HomeTelugu Trendingశ్రీలీల ప్లేస్‌లో 'ఏజెంట్‌' బ్యూటీ

శ్రీలీల ప్లేస్‌లో ‘ఏజెంట్‌’ బ్యూటీ

sakshi vaidya in vijay deva 1

బాంబే బ్యూటీ సాక్షీ వైద్య ‘ఏజెంట్’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దర్శకుడు సురేందర్ రెడ్డి, సాక్షీ వైద్య ఇన్‌స్టా రీల్స్‌ చూసి ఆమెను ఆడిషన్‌కు పిలిచాడట. కట్‌ చేస్తే అఖిల్‌ పక్కన హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. సినిమా పెద్దగా ఆడకపోయినా.. సాక్షీకి మాత్రం మంచి పేరు వచ్చింది. ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే వరుణ్‌ తేజ్ గాండీవధారి అర్జున సినిమాలో చాన్స్ పట్టేసింది.

అయితే అది కూడా అల్ట్రా డిజాస్టర్‌గా మిగిలింది. ఇక సాక్షీ కెరీర్‌ క్లోజ్ అయిపోయినట్లే.. అనుకుంటున్న టైమ్‌లో ఈ బ్యూటీకి ఓ క్రేజీ ఆఫర్ వరించింది. విజయ్‌ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి పాన్ ఇండియా సినిమాలో సాక్షీనే హీరోయిన్‌గా ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తుంది. ముందుగా ఈ సినిమాలో శ్రీలీలను తీసుకున్నా.. ప్రస్తుతం ఆమెకున్న బిజీ షెడ్యూల్‌లో డేట్స్‌ అడ్జెస్ట్‌ చేయలేకపోయింది.

దాంతో ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడదే ప్లేస్‌ను సాక్షీ వైద్య రీప్లేస్ చేసిందని టాక్‌. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ మాఫియా, డ్రగ్స్‌తో కలకళం సృష్టిస్తున్న రౌడీ మూకలను అంతమొందించే పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడట. సితార ఎంటర్‌టైనమెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్డూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!