
Salman Khan Upcoming Movies:
బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ మరోసారి కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ‘వాంటెడ్’, ‘దబాంగ్’, ‘బజరంగీ భాయిజాన్’, ‘టైగర్ జిందా హై’ వంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత ఇటీవల వచ్చిన సికందర్ పెద్దగా ఆడలేదు. అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఇప్పుడు ఆయన దక్షిణాది దర్శకుడితో పని చేయబోతున్నారు.
ఇప్పుడు తాజా వార్తల ప్రకారం, సల్మాన్ ఖాన్ మలయాళ దర్శకుడు మహేష్ నారాయణన్ తో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ పై చర్చలు జరుపుతున్నారు. మహేష్ “టేక్ ఆఫ్”, “CU Soon”, “మాలిక్” వంటి సినిమాలతో క్రిటికల్ అప్లాజ్ అందుకున్న దర్శకుడు. ఇది ఆయన మొదటి హిందీ సినిమా కావొచ్చు. ఈ సినిమా కథ సల్మాన్‌కు బాగా నచ్చిందట. త్వరలో పూర్తి స్క్రిప్ట్ వింటారట.
ఈ సినిమాను అల్విరా ఖాన్ (సల్మాన్ సోదరి) మరియు ఆమె భర్త అతుల్ అగ్నిహోత్రి సంయుక్తంగా Reel Life Productions అనే బ్యానర్‌లో నిర్మించనున్నారు. ఒకవేళ సల్మాన్ ఓకే అయితే, షూటింగ్ 2025 చివరలో లేదా 2026 ప్రారంభంలో మొదలవుతుంది.
ఇది మహేష్ నారాయణన్ చేయబోయే తొలి కమర్షియల్ సినిమా అని టాక్. గతం వరకు ఆయన చేసినవి అంతా సీరియస్ సినిమాలే అయినా, ఈసారి మాస్ కమర్షియల్ స్టైల్ లో వస్తున్నాడు.
ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ గల్వాన్ వ్యాలీ clash ఆధారంగా తీసే యుద్ధ చిత్రానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఇందులో ఆయన కల్నల్ సంతోష్ బాబు పాత్రలో నటించబోతున్నారు. ఈ సినిమా జూలై నుంచి నవంబర్ వరకు షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. తర్వాతే మహేష్ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది.