HomeTelugu Big Stories'గాడ్‌ఫాదర్‌'లో సల్మాన్‌ ఖాన్‌.. వెల్క్‌మ్‌ చెప్పిన చిరంజీవి

‘గాడ్‌ఫాదర్‌’లో సల్మాన్‌ ఖాన్‌.. వెల్క్‌మ్‌ చెప్పిన చిరంజీవి

Salman khan joins chiranjee
మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’. మోహన్‌రాజా డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా మలయాళ సూపర్‌ హిట్‌ లూసిఫర్‌కి రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నటించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

‘మీ రాక ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది. ఉత్సాహాన్ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లింది. మీతో స్క్రీన్‌ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ ప్రజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు’ అంటూ సల్మాన్‌కి గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పారు చిరు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ సినిమాలో సల్మాన్‌ సరికొత్త గెటప్‌లో కనిపించనున్నట్లు తెలుస్తుంది.

18 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న మహేష్‌ హీరోయిన్‌!

Recent Articles English

Gallery

Recent Articles Telugu