మహేష్ తో మళ్ళీ జతకడుతోందా..?

సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేయాలని చాలా మంది స్టార్ హీరోయిన్లు ఆశిస్తారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా గతంలో మహేష్ తో నటించాలనుందని తన మనసులో మాటను వెల్లడించింది. ఆ అవకాశం ఆమెకు స్పైడర్ రూపంలో వచ్చింది. ఇప్పుడు మరోసారి రకుల్, మహేష్ తో కలిసి నటించబోతుందనే ప్రచారం జరుగుతోంది.మహేష్, కొరటాల సినిమా కోసం మొదటగా హీరోయిన్ గా శృతిహాసన్ ను తీసుకోవాలనుకున్నారు.

కానీ ఇటీవల ఆమె గ్లామర్ వచ్చిన విమర్శల కారణంగా ఆమెను తప్పించి ఆ స్థానం రకుల్ ని తీసుకోవాలనుకుంటున్నారు. మహేష్ కు ఈ విషయం పట్ల సముఖంగానే ఉండడంతో రకుల్ ను ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ సినిమాను భరత్ అను నేను అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.