HomeTelugu Big Stories'ఊ అంటావా' పాటకి.. అక్ష‌య్‌ సమంత డ్యాన్స్‌ ..వీడియో వైర‌ల్

‘ఊ అంటావా’ పాటకి.. అక్ష‌య్‌ సమంత డ్యాన్స్‌ ..వీడియో వైర‌ల్

Samantha Akshay Kumar Dance
బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్‌, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత.. హాట్ స్టార్ షో కాఫీ విత్ క‌ర‌ణ్ 7వ ఎపిసోడ్‌లో సంద‌డి చేశారు. ఇప్ప‌టికే ఓ ప్రోమో విడుద‌ల చేయ‌గా అది వైర‌ల్ అవుతోంది. పుష్ప సినిమాలో స‌మంత డ్యాన్స్ చేసిన ఊ అంటావా మామ సాంగ్‌కు అక్ష‌య్ తో క‌లిసి సమంత డ్యాన్స్‌ చేసింది. ది కూల్ అండ్ ది కిల్ల‌ర్‌.. హౌస్‌లో సెగ‌లు రేపుతున్నారు.. అంటూ వీడియో షేర్ చేస్తూ సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది డిస్నీ హాట్‌స్టార్‌.

ఇప్పుడీ క‌ల‌ర్ ఫుల్ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ షో ఫన్నీ టాస్క్‌లు, గేమ్స్, క్వ‌శ్చ‌న్ అండ్ ఆన్స‌ర్స్ సెష‌న్‌తో సంద‌డిగా సాగిందని ఇప్ప‌టివ‌ర‌కు వచ్చిన వీడియో అప్‌డేట్స్ చెబుతున్నాయి. ఈ ఎపిసోడ్ జులై 21 (గురువారం)న‌ సాయంత్రం 7 గంట‌ల‌కు హాట్ స్టార్ లో ప్రీమియ‌ర్ కానుంది.
https://www.instagram.com/reel/CgOWCiEtUcc/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu