సమంత సినిమాలు ఎందుకు చేయట్లేదో చెప్పేసింది!

‘అ ఆ’,’జనతా గ్యారేజ్’,’24’ ఇలా వరుస సినిమాలతో హిట్స్ కొట్టిన సమంత ఈ మధ్య కాలంలో
కొత్తగా ఏ సినిమాలు ఒప్పుకోవడం లేదు. తను కమిట్ అయిన రెండు, మూడు ప్రాజెక్ట్స్ నుండి
కూడా తప్పుకుంది. దీంతో సమంత ఇలా చేయడానికి కారణాలు చాలానే ఉన్నాయంటూ.. రకరకాల
ఊహాగానాలు వినిపించాయి. త్వరలోనే పెళ్లి పెట్టుకోవడం వలన ఉన్న పనులతో బిజీగా ఉండడం
వలన సినిమాలకు దూరమయిందని కొందరు అంటుంటే.. తను సినిమాల్లో నటించడం పెళ్లి కొడుకు
ఫ్యామిలీకు ఇష్టం లేదని మరి కొందరు అంటున్నారు. తాజాగా ఈ విషయాలపై సమంత స్పందించింది.
నాకు తగ్గ పాత్రలు రాకపోవడం వలనే సినిమాలు చేయట్లేదని.. మంచి కథలతో కూడిన పాత్రలు
వస్తే ఎప్పటికీ నేను నటించడానికి సిద్ధంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చేసింది. సో.. ఇకపై పెళ్లైనా కూడా
సమంత సినిమాల్లో నటిస్తూనే ఉంటుందన్నమాట!
 
 
CLICK HERE!! For the aha Latest Updates