
టాలీవుడ్ సూపర్ స్టార్ సమంత ప్రస్తుతం హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఖుషి తరువాత సమంత కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే కొత్త ప్రాజెక్ట్స్‌కు సైన్ కూడా చేయలేదు. కమిట్‌మెంట్స్ ఇచ్చిన సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్‌లు కూడా తిరిగి ఇచ్చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తను ట్రావెలింగ్‌పై దృష్టిపెట్టింది. చిన్నప్పట్నుంచీ తను చూడాలనుకున్న ప్రదేశాలన్నింటినీ సరదాగా చుట్టి వచ్చే పనిలోపడింది.
ప్రస్తుతం సామ్ వరల్డ్ టూర్‌లో బిజీబిజీగా గడిపేస్తోంది. రెండు నెలల క్రితం ఇండోనేషియా బాలి వెళ్లిన సామ్.. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించింది. ఆ తర్వాత అమెరికా వెళ్లింది. అక్కడ కొన్ని ప్రదేశాలను చుట్టేసింది. ఇప్పుడు ఆస్ట్రియా టూర్‌ను ఎంజాయ్ చేస్తోంది. అక్కడ సైక్లింగ్ చేస్తూ సంతోషంగా గడిపింది. ఈ టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియా చేసింది.













