పవన్ ‘BRO’ లో స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘BRO’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ మూవీని సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ కొట్టిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

‘BRO’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. పవన్‌తో పాటు ఈ చిత్రంలో ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్ నటిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో సాయిధరమ్‌ తేజ్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రం కోసం ప్రత్యేక సెట్‌ను వేస్తున్నారు. అందులో ఓ ఐటెమ్ సాంగ్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సాంగ్ చిత్రీకరణ పూర్తిచేయనున్నారు.

ఈ మల్టీస్టారర్ మూవీలో హీరోయిన్లుగా కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు. జులై 28న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates