HomeTelugu Big Storiesసమంత వేదాంతం.. పోస్ట్‌ వైరల్‌

సమంత వేదాంతం.. పోస్ట్‌ వైరల్‌

Samantha post viral in soc 1

స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె తాజాగా నటించిన చిత్రం శాకుంతలం. ఓ వైపు ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతూనే ఈ షూటింగ్ లో పాల్గొంది. కొన్నాళ్లు బ్రేక్ తీస్కొని.. తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంది. ఇక అప్పటి నుంచి శాకుంతలం సినిమా ప్రమోషన్ పనులతో బిజీగా మారిపోయింది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

అయితే తాజాగా సమంత తన ఇన్ స్టా గ్రామ్ వేధికగా ఓ ఫొటో షేర్ చేసింది. అందులో సామ్ కారులో కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది. కళ్లద్దాలు డెనిమ్ కోర్ట్.. హెయిర్ లీవ్ చేసుకొని చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. కేవలం ఈ ఒక్క ఫొటోనే కాకుండా కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోత్స్వ కర్మణి.. అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. సామ్ కు ఏమైంది ఇలా వేదాంతం వళ్లిస్తుందని అంతా అనుకుంటున్నారు. పోస్టు చూసిన ప్రతీ ఒక్కరూ కామెంట్లు రూపంలో ఏమైంది సామ్ అంటూ ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ శ్లోకానికి అర్థం నువ్వు కర్మ చేయడానికి మాత్రమే గానీ ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు అలాగని కర్మలు చేయడం మానకు అని అర్థం. ఇప్పుడు సమంత ఈ పోస్ట్‌ ఎందుకు పెట్టిందో… కానీ ప్రస్తుతం పోస్ట్ తెగ వైరల్ గా మారింది. శాకుంతలం ఏప్రిల్ 14వ తేదీన విడుదల అయింది. టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ ఆధ్వర్యంలో కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల అయి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu