సమంతతో సినిమాలు మాన్పించే ఆలోచన లేదు: చైతు!

నాగచైతన్య, సమంత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు
అంగీకరించడంతో త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. అయితే పెళ్ళయిన తరువాత సమంత
సినిమాలకు దూరం అవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. వాటన్నింటికీ సమాధానం చెబుతూ..
చైతు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ”సమంత ఎంతో కష్టపడి హీరోయిన్ గా ఇంతటి గుర్తింపు
తెచ్చుకుంది. అటువంటి అమ్మాయిని సినిమాలు మానేయమని ఎవరు అంటారు.. నాకైతే ఆమెతో
సినిమాలు మాన్పించే ఉద్దేశం ఎంత మాత్రం లేదని చెప్పారు”. అలానే సమంతలో మీకు ఇష్టమైన
క్వాలిటీ ఏంటని..? ప్రశ్నించగా.. తను చాలా ఫ్రాంక్ గా ఉంటుంది. తనకు అనిపించింది మాట్లాడుతుంది..
నాకు తనలో నచ్చేది కూడా అదే.. అంటూ సమాధానమిచ్చాడు.

CLICK HERE!! For the aha Latest Updates