చైకి సామ్ బెదిరింపు?

నాగ‌చైత‌న్య‌- స‌మంత ల‌వ్‌స్టోరి గురించి తెలిసిందే. పెద్ద‌లు కుదిర్చిన ప్రేమ‌వివాహానికి రెడీ అవుతోంది ఈ జంట‌. జ‌న‌వ‌రిలో నిశ్చితార్థం పూర్త‌యింది. అక్టోబ‌ర్ 6న గోవాలో వివాహం జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్య త‌న జీవిత భాగ‌స్వామి గురించి మాట్లాడుతూ స్వీట్ షాక్ ఇచ్చే ఓ మాట చెప్పాడు. 
 
”ప్రేమ విషయంలో సమంతతో యుద్ధం చేశాను. నువ్వు ఇంట్లో చెప్పకపోతే ఇక నేనే నీకు రాఖీ కట్టాలి.. వేరే ఆప్షన్‌ లేదు…” అంటూ స‌మంత త‌న‌ని బెదిరించింద‌ని చై న‌వ్వూతూ అన్నారు. నాగ‌చైత‌న్య న‌టించిన ‘యుద్ధం శ‌ర‌ణం’ సెప్టెంబ‌ర్ 8న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఓ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో చైతన్య ఈ స్వీట్ మెమ‌రీని గుర్తు చేసుకున్నారు. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలోని ‘ఏ మాయ చేశావె’ సినిమా కోసం నాగ‌చైత‌న్య – స‌మంత జోడీ క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా సెట్స్‌లో ఉండ‌గానే ఆ ఇద్ద‌రిమ‌ధ్యా ప్రేమ చిగురించింది.
CLICK HERE!! For the aha Latest Updates