భర్త, కొడుకుతో స్నేహ.. ఫొటోలు వైరల్‌

నటి స్నేహ..ఒకప్పుడు తెలుగులో హీరో వెంకటేష్, నాగార్జున సరసన నటించడంతో పాటు పలువురు కుర్ర హీరోల సరసన హీరోయిన్‌గా చేసిన సంగతి తెలిసిందే. తన అందచందాలతోనే కాకుండా మంచి నటిగాను పేరు తెచ్చుకుంది. ‘శ్రీ రామదాసు’ సినిమాలో స్నేహ నటనకు మంచి మార్కులు పడ్డాయి. హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే తమిళ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకుంది స్నేహ. ప్రస్తుతం భర్త, కుమారుడు విఘ్నేష్‌తో కలిసి స్నేహ విదేశాల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తుంది. దానికి సంబందించిన ఫొటోస్.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.