సమీరా రెడ్డి లుక్‌ వైరల్‌

ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ సమీరా రెడ్డి.. 2005 లో వచ్చిన నరసింహుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సమీరా మెగాస్టార్ తో జై చిరంజీవ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టింది. టాలీవుడ్ లో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. హిందీ, తమిళంలో అనేక సినిమాలు చేసి మెప్పించింది. కెరీర్ మంచి స్వింగ్ లో ఉండగానే 2014 లో అక్షయ్ వార్డె ను వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. 2015 లో బిడ్డకు జన్మను ఇచ్చిన సమీరా.. ఆ తరువాత విపరీతంగా వెయిట్ పెరిగింది. దాదాపు 102 కేజీల బరువు పెరగడంతో అందరు షాక్ అయ్యారు. అసలు ఎవరు ఈమె… సమీరానా కాదా అనేంతగా మారిపోయింది.

ఇదిలా ఉంటె, పెరిగిన బరువును తిరిగి తగ్గించేకోవడానికి సమీరా అనేక ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం సమీరా తిరిగి తన స్టైలిష్ లుక్ లోకి వచ్చేసింది. సోషల్ దిగ్గజం ఇంస్టాగ్రామ్ లో 2015 లో ఉన్న ఫోటోను 2019 లో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోను చూసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.