పవన్ సినిమాకు సమస్యల్లా అతడే!

త్రివిక్రమ్ సాధారణంగా ఓ సినిమా చేయడానికి ఎనిమిది నుండి తొమ్మిది నెలల సమయం తీసుకుంటాడు. కానీ పవన్ మాత్రం తన సినిమాను నాలుగు నెలల్లో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. దీంతో ఆ ఒత్తిడి త్రివిక్రమ్ పై పడుతోందని తెలుస్తోంది. చాలా విషయాల్లో త్రివిక్రమ్ కాంప్రమైజ్ అవుతున్నాడు. తను అనుకున్న నటీనటులు కాకుండా అందుబాటులో ఉన్న వారిని ఎన్నుకుంటున్నాడు. అయితే ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ పై పడకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే సినిమాకు ఓ సమస్య వచ్చి పడిందని తెలుస్తోంది. వారికున్న వ్యవధిలో చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ పాటల పని పూర్తి చేస్తాడా..? లేదా..? అనే అనుమానంలో త్రివిక్రమ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
 
గతంలో త్రివిక్రమ్ చేసిన ‘అ ఆ’ సినిమాకు కూడా మొదటగా అనిరుధ్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు. టైమ్ ఫ్యాక్టర్ కారణంగా మిక్కీ ని తీసుకున్నారు. కానీ ఈసారి ఆ ఛాన్స్ లేదు. ఇప్పటికే అనిరుధ్ మూడు పాటలను కంపోజ్ చేశాడు. మిగిలిన పాటలు, నేపధ్య సంగీతం తొందరగా పూర్తి చేయమని త్రివిక్రమ్ నుండి అనిరుధ్ కి ఒత్తిడి వస్తుండడంతో అతడు కాస్త అసహనంగా ఫీల్ అవుతున్నాడట. నిజానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడానికి అనిరుధ్ చాలా ఎక్కువ సమయం తీసుకుంటాడు. అలాంటప్పుడు పవన్ అనుకున్న టార్గెట్ కు సినిమా రీచ్ అవ్వడం కష్టం. మరి అనిరుధ్ ఈ టెన్షన్ నుండి త్రివిక్రమ్ ను బయటపడేస్తాడో.. లేదో.. చూడాలి!