HomeTelugu Trending'బ‌జార్ రౌడీ’గా సంపూర్ణేష్ బాబు

‘బ‌జార్ రౌడీ’గా సంపూర్ణేష్ బాబు

Sampoornesh babu new movie
లాక్‌డౌన్ త‌రువాత బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు న‌టించిన చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాకి ‘బ‌జార్ రౌడీ’ అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. వసంత నాగేశ్వరావు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా కె‌ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌‌పై నిర్మాత సందిరెడ్డి శ్రీనివాస‌రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుకి జోడీగా మ‌హి న‌టిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో ఒక పాటను కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

‘ఛ‌త్రప‌తి, విక్రమార్కుడు, య‌మ‌దొంగ, ప‌రుగు, మ‌గ‌ధీర‌, ఆర్య-2, డార్లింగ్‌, సింహ‌, మ‌ర్యాద‌ రామ‌న్న, 100% ల‌వ్‌, బృందావ‌నం, కందిరీగ‌, పూల‌రంగ‌డు, ఇష్క్‌, ర‌చ్చ, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, బాహుబ‌లి, రంగ‌స్థలం’ లాంటి ఎన్నో బ్లాక్‌ బ‌స్టర్ మూవీస్‌కే కాకుండా త‌మిళంలో ‘మార్షల్‌, వీరం, శ‌గుని, వేలాయుదం’ లాంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌కి, సూప‌ర్‌ స్టార్స్‌కి కొరియోగ్రఫి అందించారు ప్రేమ్ రక్షిత్. ఇప్పుడు ఈయన ‘బ‌జార్ రౌడీ’తో అదిరిపోయే స్టెప్పులు వేయిస్తున్నారు. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో షాయాజీ షిండే, 30 ఇయ‌ర్స్ పృథ్వి, నాగినీడు, ష‌ఫి, జీవా, స‌మీర్‌, మణిచంద‌న‌, న‌వీన‌, ప‌ద్మావ‌తి, కత్తి మహేష్ నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌, టీజ‌ర్ త‌దిత‌ర వివ‌రాలు అతి త్వర‌లో తెలియ‌జేస్తాం’’ అని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu