HomeTelugu Trendingసంపూర్ణేష్‌ బాబుకి తృటిలో తప్పిన ప్రమాదం

సంపూర్ణేష్‌ బాబుకి తృటిలో తప్పిన ప్రమాదం

Accident to sampoornesh bab

టాలీవుడ్‌ నటుడు సంపూర్ణేష్‌ బాబుకు ‘బజార్‌ రౌడీ’ అనే సినిమా షూటింగ్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. ఎలాంటి గాయాలు కాకపోవడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. హైదరాబాద్‌ శివారులో జరుగుతున్న షూటింగ్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. వసంత నాగేశ్వర రావు డైరెక్షన్‌లో సందిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న చిత్రం ‘బజార్‌ రౌడీ’. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ శివారులో జరుగుతున్నట్టు సమాచారం. అయితే షూటింగ్‌లో భాగంగా సంపూర్ణేష్‌ బైక్‌ను పైకి లేపి సంచుల మధ్య నుంచి కిందకు దూకాలి. ఆ సీన్‌ తీస్తుండగా బైక్‌పై సంపూర్ణేష్‌ లేచి కిందకు దిగుతుండగా అదుపు తప్పింది. తాడుతో బైక్‌ను కిందకు దింపే సమయంలో అదుపు తప్పి ప్రమాదం జరిగింది. బైక్‌తో పాటు సంపూ కింద పడిపోయాడు. లేవడానికి ప్రయత్నించగా కుదరలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడున్న వారు సంపూర్ణేష్‌ బాబును పైకి లేపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu