
అదృష్టం అంటే సంయుక్త మీనన్ దే. సంయుక్త మీనన్ జోరుకి మిగతా హీరోయిన్లు బేజారు అన్నట్టుగా అమ్మడుకి అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. నిజానికి మొన్నటివరకూ సంయుక్త మీనన్ పని అయిపోయింది, ఆమెకు అవకాశాలు రావడం లేదు అని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అప్పటి నుంచి సంయుక్త మీనన్ కి క్రేజ్ బిల్డ్ కాలేదు. తన ఇంటి ముందు దర్శకనిర్మాతలు టెంట్ వేసుకుని మరీ తనను తమ సినిమాల్లో బుక్ చేసుకుంటున్నారు అంటూ ఆ మధ్య సంయుక్త మీనన్ బిల్డప్ ఇచ్చింది. అప్పటి నుంచి వచ్చే అవకాశాలు కూడా కరువయ్యాయి. ఇక సంయుక్త మీనన్ కి తెలుగులో కూడా కెరీర్ కష్టమే అనుకున్నారు.
ఐతే, ఇప్పుడు సంయుక్త మీనన్ క్రేజీ బిజీ తారగా మారిపోయింది. ఎలాగూ సంయుక్త మీనన్ కి లేటెస్ట్ గా సార్ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. పైగా సంయుక్త మీనన్ నటనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే, హీరోలు వెనక్కి తగ్గడం లేదు. నిజానికి సంయుక్త మీనన్ నటనకు హీరోలే కాదు.. ఆడియన్స్ కూడా ఫిదా అవ్వడంతో.. ఆమెకి ఇంత డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం సంయుక్త మీనన్ కోసం మేకర్స్ ఎగబడుతున్నారు. ధనుష్ తో కలిసి నటించడం ద్వారా సంయుక్త మీనన్ కి స్టార్స్ నుంచి పిలుపు అందుతుంది.

సంయుక్త మీనన్ కి ప్రస్తుతం తెలుగు – తమిళం నుంచి వరుస సినిమాలు వస్తున్నాయి. ఆల్ రెడీ సంయుక్త మీనన్ విశాల్, హీరో నాని, అలాగే ధనుష్ తో మరో పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తోంది. తాజాగా సంయుక్త మీనన్ కి మరో రెండు ప్రాజెక్ట్ లు ఫైనల్ అయ్యేలా ఉన్నాయి. ఇప్పుడు శివ కార్తీకేయన్ కొత్త సినిమాలో కూడా సంయుక్త మీనన్ పేరు వినిపిస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరితో రీసెంట్ గా ఓ సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సంయుక్త మీనన్ పేరుని పరిశీలిస్తున్నారు.
నిజంగా విజయ్ దేవరకొండ – సంయుక్త మీనన్ జోడీ చూడముచ్చటగా ఉంటుందని రౌడీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఫైనల్ చేసి.. మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. సంయుక్త మీనన్ 2016లో ‘పాప్‌కార్న్’ అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ్, కన్నడ మరియు తెలుగు భాషా చిత్రాల్లో వరుసగా నటిస్తోంది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు













