HomeTelugu Trendingనిర్మాతగా మారిన విజయ్‌ దేవరకొండ దర్శకుడు

నిర్మాతగా మారిన విజయ్‌ దేవరకొండ దర్శకుడు

2 8సందీప్ రెడ్డి వంగ.. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ ఆరువాత బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ గా రీమేక్ చేశారు. ఆ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కబీర్ సింగ్ నిలిచింది. ఇప్పడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో మరో సినిమా చేయబోతున్నారు.

దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారి సినిమా చేస్తున్నారట. కబీర్ సింగ్ నిర్మాతలు మూరత్ ఖేతని, అశ్విన్ వార్థేలతో కలిసి సినిమా చేయబోతున్నారు. ఎవరితో సినిమా చేస్తున్నారు. హీరో ఎవరు అనే విషయాలను త్వరలోనే వెల్లడిస్తారట. టాలీవుడ్‌లో మహేష్ బాబుతో సినిమా చేయడానికి సందీప్ ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా బిజీలో ఉన్నారు. నెక్స్ట్ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu