ప్రభాస్‌పై సంజన కామెంట్స్‌


టాలీవుడ్‌లో ‘బుజ్జిగాడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సంజన గల్రానీ. పూరి జగన్నాథ్‌ డైరెక్షణ్‌లో ప్రభాస్‌ నటించిన ఈ సినిమా క్లాస్‌తో పాటు మాస్‌ ఆడియెన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా హిట్‌ అయినా సంజనకు మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటీవలే కన్నడ పరిశ్రమకే పరిమితమైన సంజన డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితాన్ని గడిపిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది సంజన.

ఓ సినిమా ప్రమోషన్‌ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన సంజన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకుంది. బుజ్జిగాడు సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రభాస్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘ప్రభాస్‌ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు. ఆయన చాలా డెడికేటెడ్‌ ఆర్టిస్ట్‌‌. రాయల్‌ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఎంతో కష్టపడేవాడు. బుజ్జిగాడు షూటింగ్‌ సమయంలో ప్రభాస్‌ చాలా సన్నగా కనిపిస్తారు. క్యారెక్టర్‌ కోసం ప్రతిరోజు ఆయన కేవలం పెసరెట్టు మాత్రమే తినేవారు. ఆయన ఎంత హార్డ్‌ వర్క్‌ చేస్తారన్నది ప్రభాస్‌ ఫిజిక్‌ చూస్తే అర్థం అవుతుంది. ఇక ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయిన ప్రభాస్‌తో పనిచేసినందుకు సంతోషంగా భావిస్తున్నా’ అని సంజన తెలిపింది.

CLICK HERE!! For the aha Latest Updates