సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియోకు అతిధిగా పవన్!

శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవి కిరణ్ నిర్మించిన సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్. టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ భామ రోషిని ప్రకాశ్ ఈ సినిమాలో సప్తగిరి సరసన నటిస్తోంది. గతంలో మురారి, లెజెండ్ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన సి.రామ్ ప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించినట్లుగా చిత్ర బృందం తెలిపింది. నూతన సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. హైదరాబాద్, పోలాండ్, జర్మనీల్లో సప్తగిరి ఎక్స్ ప్రెస్ షూటింగ్ జరిగింది. ఇటీవలే చిత్రీకరణ ముగించుకున్న సినిమా యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీ గా ఉంది. నవంబర్ 6న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియో రిలీజ్ జరగనుంది. ఈ కార్యక్రమం కోసం సప్తగిరి ఎక్ప్ ప్రెస్ టీమ్ పెద్ద ఎత్తున్న సన్నాహాలు చేస్తున్నారు. కొద్ది రోజులు క్రితం విడుదల చేసిన మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన రావడంతో త్వరలోనే విడుదల కాబోతున్న ఆడియోకు, ఆ తరువాత వచ్చే సినిమాకు అదే రీతన స్పందన వస్తోందని సప్తగరి ఎక్స్ ప్రెస్ దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. నవంబర్  మూడో వారంలో ఈ సినిమాను విడుదల చేయబోతున్న ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ : డాక్టర్ వాణి రవికరిణ్, క్రియేటివ్ హెడ్ : గోపాల్ అమిరశెట్టి, ఎడిటిర్ : గౌతంరాజు, మాటలు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల

CLICK HERE!! For the aha Latest Updates