‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ వచ్చేస్తోంది!

కమెడియన్ గా కడుపుబ్బా నవ్విస్తున్న స్టార్ కమెడియన్ సప్తగిరి ఇప్పుడు హీరోగానూ అలరించేందుకు సిద్ధమయ్యాడు. ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్టర్ హోమియోపతి ద్వారా వైద్యరంగంలో సేవలందిస్తున్న డాక్టర్ కె.రవికిరణ్… సాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ఇటీవలై విడుదలైన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ కి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ సందర్భంగా ప్రేక్షకులతో పాటు మీడియా వారికి సప్తగిరి ఎక్స్ ప్రెస్ నిర్మాత డాక్టర్ రవికిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. అలానే త్వరలోనే విడుదల కాబోతున్న తమ సినిమాను పెద్ద మనసుతో ఆదరించాలని కోరారు. సినిమా ప్రేమికుడుగా సినిమా ఎలా ఉండాలో అని మాత్రమే డిస్కస్ చేసేవాడిని. అయితే ఓ సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ వారు ఎంతగా కష్డపడతారో, తపన పడతారో ఈ సినిమాతోనే నాకు తెలిసింది. ఎటువంటి అశ్లీలతకు చోటు లేకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలసి చూసేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here