HomeTelugu Big Stories'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్ల సునామీ

‘సరిలేరు నీకెవ్వరు’ కలెక్షన్ల సునామీ

6 12
సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 11న విడుదలైన మహేష్‌బాబు చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి స్పెషల్ ట్రీట్ ఇస్తూ ఇటు ప్రేక్షక లోకాన్ని అటు చిత్రయూనిట్ సభ్యులను ఆనందపెట్టారు. మొదటి రోజే సూపర్ సక్సెస్ టాక్ తెచ్చుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ మూడు రోజులు ముగిసేసరికి రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. మహేష్ కెరీర్‌లో 100 కోట్ల మార్క్ దాటినా ఆరో సినిమాగా ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ రికార్డు క్రియేట్ చేసింది.’ప్రతి సంక్రాంతికి అల్లుడొస్తాడు.. కానీ ఈ సంక్రాంతికి మొగుడొస్తున్నాడు” అని సరిలేరు నీకెవ్వరు విడుదలకు ముందే హింట్ ఇచ్చిన మహేష్ బాబు.. దాన్ని నిరూపించి చూపించారు.

సంక్రాంతి సందడి చేస్తూ భారీ వసూళ్లు రాబడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లోనూ సరిలేరు నీకెవ్వరు సినిమా జోరుమీదుంది. 95% ఆక్యుపెన్సీతో మహేష్ బాబు బీభత్సం సృష్టిస్తున్నారు. క్లాస్, మాస్ అని తేడా లేకుండా అన్ని సెంటర్లలో మహేష్ మానియా కనిపిస్తోంది. మొదటి రెండు రోజులు కుమ్మేసిన మహేష్ బాబు మూడో రోజు కూడా అదే ఫామ్ కొనసాగించారు. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇచ్చాయి. సంక్రాంతి ముగిసేదాకా రోజు 6 షోస్ వేసుకునేలా అనుమతి ఇచ్చాయి. కాబట్టి మరో రెండు మూడు రోజుల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వసూళ్లలో మరో రికార్డు సాధించడం ఖాయమంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu