ఎన్టీఆర్ లిస్ట్ లో మరో ప్రాజెక్ట్!

మనం, 24 వంటి విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం అఖిల్ హీరోగా ‘హలో’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. డిసంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తరువాత విక్రమ్.. అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఓ ప్రముఖ నిర్మాత ఇటీవల విక్రమ్ ను కలిసి ఎన్టీఆర్ కోసం ఓ కథను సిద్ధం చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. దానికి విక్రమ్ కూడా అంగీకరించాడట. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘జై లవకుశ’ చిత్రంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. దీని తరువాత విక్రమ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి.