HomeTelugu Big Stories'సర్కారువారి పాట' మహేశ్‌ బర్త్ డే బ్లాస్టర్ టైమ్‌ ఫిక్స్‌

‘సర్కారువారి పాట’ మహేశ్‌ బర్త్ డే బ్లాస్టర్ టైమ్‌ ఫిక్స్‌

Sarkaru vaari paata new upd
ఆగస్టు 9 సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు పుట్టిన రోజు ఈ నేపధ్యంలో అప్పుడే సెలబ్రెషన్స్‌ స్టార్ట్‌ అయిపోయాయి. అయితే తాజాగా ఆయన నటిస్తున్న ‘స‌ర్కారువారి పాట‌’ చిత్రం మూవీ యూనిట్‌ బర్త్ డే బ్లాస్టర్ విడుదల టైమ్‌ ని ప్రకటించింది. ఆగస్ట్ 9న ఉదయం గం.9:09 నిమిషాలకు స్పెషల్ వీడియో రిలీజ్ అవుతుందని వెల్లడించారు. దీంతో పాటు మరో న్యూలుక్‌ రిలీజ్‌ చేశారు. మ‌హేశ్ ఫ్రంట్ ఫొజుతో న‌డుముకున్న బెల్టును క‌ట్టుకోవ‌డాన్ని చూడొచ్చు. ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో హైప్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు టీజ‌ర్ ఎలా ఉండ‌బోతుందోన‌నే అంచ‌నాలు ఆశాకాన్నంటాయి. మహేశ్‌ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌, రామ్ ఆచంట గోపీ ఆచంట నిర్మిస్తోన్నఈ’ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. జనవరి 13, 2022న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu