HomeTelugu Big Storiesమహేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌

Sarkaru vari pata movie s

కరోనా మహమ్మారి కారణంగా సినిమా ఇండస్ట్రీ ఎంతో నష్టపోయిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్‌తో ఇండస్ట్రీలో మళ్లీ సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు సినిమాల షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కానీ తాజా సమాచారం ప్రకారం.. దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో సినిమా షూటింగ్స్ త్వరగా ప్రారంభించే దిశగా మేకర్స్ ఆలోచన చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా యూనిట్‌ కూడా త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని షెడ్యూల్ రెడీ చేస్తున్నారట. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇదివరకు ప్రకటించారు మేకర్స్‌. కానీ తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా సంక్రాంతి కాకుండా ఈ ఏడాది చివరిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాట్లు వినికిడి. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో మహేష్‌ న్యూ లుక్ లో కనిపించనున్నాడు. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. మరి జులైలో మూడో షెడ్యూల్ స్టార్ట్ అవుతుందేమో చూడాలి. ఈ సినిమాను మైత్రి మేకర్స్ – 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి మహేష్ కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu