ప్రభాస్ కు హీరోయిన్ కొత్త బిరుదిచ్చింది!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంది శ్రద్ధాకపూర్. ప్రభాస్ గురించి ఒక్కో విషయం చెబుతూ ఆమె ఆసక్తి పెంచుతోంది. మొదట ప్రభాస్ ఆతిధ్యం గురించి చెప్పిన శ్రద్ధా తాజాగా ప్రభాస్ కు కొత్త బిరుదు కూడా ఇచ్చింది. షూటింగ్ సంధర్భంగా యూనిట్ తో మాట్లాడుతోన్న శ్రద్ధా.. ప్రభాస్ నటించిన అన్ని సినిమాలను చూసేశానని.. అతడి నటన గురించి తెలుసుకోవడానికే అతడి సినిమాలు చూశానని చెప్పుకొచ్చింది.

అంతేకాదు.. ప్రభాస్ ను అందరూ రెబెల్ స్టార్ అంటున్నారని కానీ నిజానికి ఆయన ‘ది న్యూ బ్లాక్ బాస్టర్ కింగ్’ అని కొత్త బిరుదుని ఇచ్చింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.