HomeTelugu Big Storiesసత్యదేవ్ 'స్కైలాబ్' ఫస్ట్ లుక్ విడుదల

సత్యదేవ్ ‘స్కైలాబ్’ ఫస్ట్ లుక్ విడుదల

Sky Lab telugu movie first

విభిన్న పాత్రల్లో నటిస్తూ టాలెంటెడ్‌ హీరోగా పేరుతెచ్చుకున్న నటుడు సత్యదేవ్ తాజా చిత్రం స్కైలాబ్. నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్ విడుదలైంది. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేఎఫ్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందుతోంది. 1979లో జరిగిన స్కైలాబ్ ఘటన ఆధారంగా అప్పటి పరిస్థితులను తెరకెక్కించబోతున్నారు.
అమెరికా ప్రయోగించిన స్కైలాబ్ భూమిపై పడబోతుందని, దీంతో భూమి అంతా నాశనమైపోతుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రపంచమంతా ఏం జరుగుతుందోనని ఊపిరి బిగబట్టి ఎదురుచూసింది. ఆ ఘటన ఓ గ్రామంలోని కొందరి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపింది, వారి జీవితాల్లో పరిణామాలు జరిగాయనే విభిన్న కథతో స్కైలాబ్‌ను రూపొందిస్తున్నారు. అలనాటి రోజుల్లోకి తీసుకెళ్లి ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. అంతరిక్షం నుంచి పడిపోతున్న ఉపగ్రహంపై కూర్చుని ఉన్న సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ, కొందరు గ్రామస్తులతో పోస్టర్ రూపొందించారు. దీంతో ఈ చిత్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu