సునీల్ కు త్రివిక్రమ్ ఛాన్స్!

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సినిమా ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం ముందుగా నారా రోహిత్ ను తీసుకోవాలని చిత్రబృందం అనుకుంది. అయితే ఇప్పుడు ఆ పాత్రను సునీల్ కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో త్రివిక్రమ్.. ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఒప్పించాడని అంటున్నారు.

కమెడియన్ గా టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడే హీరోగా తన కెరీర్ ను టర్న్ చేసుకున్నాడు సునీల్. అయితే కమెడియన్ గా ఆయన అందుకున్న విజయాల ముందు హీరోగా తేలిపోతున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన ఒక్క సినిమా కూడా హిట్టు కాలేదు. దీంతో తిరిగి మళ్ళీ కమెడియన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

అది కూడా త్రివిక్రమ్ సినిమాతో అని తెలుస్తోంది. గతంలో సునీల్ కు త్రివిక్రమ్ తన సినిమాలో అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడే ఎన్టీఆర్ సినిమాలో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.