HomeTelugu Trendingతిమ్మరుసుగా సత్యదేవ్‌

తిమ్మరుసుగా సత్యదేవ్‌

Satya Dev Thimmarusu rel
టాలీవుడ్‌ యంగ్‌ హీరో సత్యదేవ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్. ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది‌. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ‘తిమ్మరుసు’ సినిమా చిత్రీకరణంతా పూర్తి చేసుకుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, సత్యదేవ్ ఇందులో పవర్ ఫుల్ లాయర్ గా నటిస్తున్నాడని నిర్మాత మహేశ్ కోనేరు తెలిపారు. సత్యదేవ్ లుక్‌, క్యారెక్టర్‌ డిజైనింగ్‌ చాలా కొత్తగా ఉంటుందని, డైరెక్టర్‌ శరణ్‌ కొప్పిశెట్టి, పక్కా ప్లానింగ్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేశారని, మూవీ టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. ‘ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు మంచి సందేశం కూడా ఇందులో ఉంద’ని దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి చెప్పారు. మే 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu