HomeTelugu Reviewsనిశ్శబ్దం రివ్యూ

నిశ్శబ్దం రివ్యూ

Nishabdham movie Review

హీరోయిన్‌ అనుష్క శెట్టి నటిస్తున్న తాజా చిత్రం నిశ్శబ్దం. జనవరిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్ంర లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఈరోజు అక్టోబర్ 2న ఓటీటీలో విడుదల అయింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం

కథ: కథ మొత్తం అమెరికాలోని వీధుల్లో, సీక్విమ్ నగరాల మధ్య నడుస్తుంది. సాక్షి (అనుష్క) చెవిటి, మూగ అమ్మాయి. కానీ, మంచి పెయింటర్. మరోవైపు ఆంటొని (మాధవన్) సెలబ్రిటీ మ్యుజీషియన్.. మిలియనీర్. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. నిశ్చాతార్ధం తరవాత వీరిద్దరూ కలిసి సరదాగా ట్రిప్‌కు వెళ్తారు. ఈ ట్రిప్‌లో భాగంగా ఓ పాత ఇంటికి వీరిద్దరూ వెళ్తారు. ఆ ఇంటిలో 1972లో భార్యాభర్తలు హత్యకు గురవుతారు. ఇప్పుడు అదే ఇంటిలో ఆంటొని కూడా హత్యకు గురవుతాడు. కానీ, సాక్షి తప్పించుకుంటుంది. అసలు ఆంటొనిని ఎవరు చంపారు? మూగ అమ్మాయి అయిన సాక్షి పోలీసులకు ఎలా సహకరించింది? అసలు ఆ హంతకుడు ఎవరు? అనే విషయాలు సినిమాలోనే చూడాలి.

నటీనటులు: ఇక నటీనటుల విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అనుష్క గురించి. చెవిటి, మూగ అమ్మాయిగా అనుష్క బాగా నటించారు. సినిమా మొత్తం సైన్ లాంగ్వేజ్‌తోనే నడిచిపోయింది. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్‌సన్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. కాకపోతే, సాక్షి, ఆంటొని పాత్రలే హైలైట్‌గా నిలిచాయి.

విశ్లేషణ: దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ కథను చాలా క్రియేటివ్‌గా రాసుకున్నారు. ఆంటొని హత్యకు కారకులు ఎవరో తెలిసిన తరవాత ఇక ఆ తరవాత జరిగే కథ అంతా ఊహాజనితమే. అయితే, మొదటి గంటన్నర పాటు సినిమా ఆసక్తికరంగానే సాగింది. సినిమా తొలి సన్నివేశంతోనే హారర్ మూవీ అనే భావనను కలిగించాడు డైరెక్టర్‌. ఎప్పుడో 48 ఏళ్ల క్రితం జరిగిన హత్యలు, మూతబడిన ఇల్లును తమకు అనుగుణంగా వాడుకొని ఆంటొనీని ఎలా హత్య చేశారు అనే విషయాన్ని బాగానే కన్విన్సింగ్‌గా చెప్పారు. ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకుడికి థ్రిల్‌ని ఇస్తాయి. సినిమా మొత్తాన్ని సీటల్, సీక్విమ్ నగరాల పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించడంతో హాలీవుడ్ లుక్ వచ్చింది. గోపీ సుందర్ అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘నిన్నే నిన్నే’ సాంగ్ చాలా బాగుంది.

టైటిల్: నిశ్శబ్దం
న‌టీన‌టులు: అనుష్క, మాధవన్, మైకేల్ మ్యాడ్సన్,అంజలి తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: హేమంత్ మధుకర్
నిర్మాత‌లు:విశ్వప్రసాద్
సంగీతం: గోపీసుందర్

హైలైట్స్: అనుష్క, మాధవన్‌ నటన
డ్రాబ్యాక్స్: కొన్ని సన్నివేశాలు

చివరిగా: కొంతమందిని మాత్రమే థ్రిల్‌ చేసే ‘నిశ్శబ్దం’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu