HomeTelugu Trendingకూతురిని పరిచయం చేసిన కోలీవుడ్‌ జంట

కూతురిని పరిచయం చేసిన కోలీవుడ్‌ జంట

Sayesha and Aryas daughter
కోలీవుడ్‌ హీరో ఆర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తెలుగులో మొదటగా అల్లు అర్జున్ వరుడు సినిమాలో విలన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక తర్వాత అనుష్క సైజ్ జీరో సినిమాలో కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించాడు. అయితే ఆర్య హీరోయిన్ సాయేషాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఏడాది క్రితం వీరు ఒక పాపకు కూడా జన్మనిచ్చారు. ఇక ఆ పాప ఫోటోలు ఇప్పటి వరకు సోషల్ మీడియాలో విడుదల చేయలేదు. ఇక మొత్తానికి ఇటీవల మొదటి పుట్టినరోజు రోజు సందర్భంగా సాయేషా వారి పాపను సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ కు పరిచయం చేశారు.

పాప పేరు అరియానా అంటూ మాదొక చక్కని చిన్న ఫ్యామిలీ అని క్యాప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అరియానా కూడా చాలా క్యూట్ గా ఉంది అని ఈ చిన్న ఫ్యామిలీ చాలా అందంగా ఉంది అంటూ ఫ్యాన్ ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఆర్య అయితే ప్రస్తుతం తమిళంలోనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇక సాయేషా ప్రస్తుతం అయితే ఆమె తన ఫ్యామిలీ లైఫ్ తోనే ఎంజాయ్ చేస్తోంది. భవిష్యత్తులో సినిమాలు చేస్తుందా లేదా అనే విషయంలో మాత్రం ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!