HomeTelugu Trendingశేఖర్ కమ్ముల నెక్ట్స్‌ మూవీ ఫిక్స్‌..

శేఖర్ కమ్ముల నెక్ట్స్‌ మూవీ ఫిక్స్‌..

5 22
దర్శకుడు శేఖర్ కమ్ముల తర్వాత సినిమా కూడా కన్ఫార్మ్ అయ్యింది. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవిలతో శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ ఇంకో 15 రోజులు అయితే పూర్తవుతుంది. కాగా శేఖర్ కమ్ముల తన తర్వాత సినిమాను కూడా లాక్ చేసేశాడు. అది కూడా ‘‘లవ్ స్టోరీ’’ మూవీ నిర్మాతతోనే. ఓ స్టార్ హీరో ఈ మూవీలో నటించనున్నారు. ఒక సినిమా తరువాత ఎప్పుడూ గ్యాప్ తీసుకునే శేఖర్ కమ్ముల ఈసారి లాక్ డౌన్ బ్రేక్ లో తన తర్వాతి సినిమాకు సంబంధించిన వర్క్ కూడా చేసుకుంటున్నారు. లవ్ స్టోరీ మూవీ కంటెంట్ మీదున్న నమ్మకం, శేఖర్ పనితనం నచ్చిన ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ తమ తరవాత సినిమా కూడా శేఖర్ ను చేయమని కోరగానే.. ఆయన వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే లవ్ స్టోరీ సినిమా విడుదల అవ్వగానే ఈ మూవీ పట్టాలెక్కనుందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu