HomeTelugu Trendingటాలీవుడ్‌ డైరెక్టర్‌కు మాతృవియోగం

టాలీవుడ్‌ డైరెక్టర్‌కు మాతృవియోగం

7 20
టాలీవుడ్‌ డైరెక్టర్‌ శ్రీవాస్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీవాస్‌ తల్లి ఓలేటి అమ్మాజి(68) శనివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామమైన పురుషోత్తపట్నంలో శనివారం మధ్యాహ్నం 12.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. అమ్మాజికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దర్శకుడు శ్రీవాస్‌ అమ్మాజికి రెండో సంతానం. శ్రీవాస్‌ తల్లి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

గోపీచంద్‌ హీరోగా నటించిన ‘లక్ష్యం’ సినిమాతో శ్రీవాస్‌ దర్శకుడిగా పరిచయమయ్యారు. రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం, డిక్టేటర్‌, సాక్ష్యం సినిమాలను ఆయన తెరకెక్కించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu