సంచలన నటి శ్రీరెడ్డి రాజకీయ ప్రవేశం..?

సంచలన నటి శ్రీరెడ్డి సినిమాల కంటే కాస్టింగ్ కౌచ్ వ్యవహారంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ నగరం సైదాబాద్‌లో ఓ బేకరి ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడింది. ‘నన్ను రెండు రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయి అని శ్రీరెడ్డి చెప్పింది. అయితే పార్టీల పేర్లను మాత్రం చెప్పలేదు.

తనకు రాజకీయాల పై ఆసక్తి లేదని… తను పాలిటిక్స్‌ లోకి వస్తున్నట్లుగా సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అని శ్రీరెడ్డి వివరణ ఇచ్చింది. ప్రస్తుతం రాజకీయాలలోకి వచ్చే ఆలోచన లేదంటూ.. పవన్‌ పార్టీపై మరోసారి విమర్శలు చేసింది. రాబోయే ఎన్నికలలో పవన్‌ కళ్యాణ్‌కు ఘోర పరాభవం తప్పదని, జనసేన పార్టీ కేవలం మూడు, నాలుగు సీట్లకు మాత్రమే పరిమితం కావచ్చు’ అని శ్రీ రెడ్డి చెప్పింది.

వరుసగా అందరిపైన ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డిని త్వరగా మెంటల్‌ హాస్పిటల్‌లో చేర్పించాలంటూ..నోటికి వచ్చినట్లు మాట్లాడం తగదని అభిమానులు కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.