‘బాహుబలి’పై రాజమౌళి ఎమోషనల్‌ ట్వీట్‌

‘బాహుబలి’ ముందుగా తెలుగు సినిమాగా ప్రారంభమై.. ఆ తర్వాత జాతీయ స్థాయి సినిమాగా ఆపై అంతర్జాతీయంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పేరు మారు మోగేలా చేసింది. తాజాగా ఈ సినిమాపై రాజమౌళి ట్వీట్ చేసాడు. వివరాల్లోకి వెళితే.. 2015లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఒక సంచలనం సృష్టించింది. అంతేకాదు తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. ఈ సినిమాలో నటించిన ప్రభాస్, రానాలు ఆల్ ఇండియా స్టార్స్‌ అయిపోయారు. ఐతే.. ఈసినిమాను లండన్‌లోని ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో స్కోర్ వినిపించబోతున్న తొలి నాన్ ఇంగ్లీష్ సినిమాగా బాహుబలి ..ది బిగినింగ్‌ రికార్డులకు ఎక్కింది. ఈ విషయమై చాలా సంతోషంగా ఉందంటూ రాజమౌళి కాస్తంత ఎమెషనల్ ట్వీట్ చేసాడు.

ఈ నెల 19న అక్కడ ‘బాహుబలి.. ది బిగినింగ్’ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకకు బాహుబలి టీమ్ మొత్తం హాజరు కానుంది. ‘బాహుబలి’ తో పాటు అక్కడ ‘స్కైఫాల్’,’హ్యరీ పోటర్’ వంటి చిత్రాలను ప్రదర్శించనున్నారు. అంతేకాదు అక్కడ కీరవాణి ఆధ్వర్యంలో అక్కడ ఓ లైవ్ కాన్సెర్ట్ కూడా జరగనుంది.

CLICK HERE!! For the aha Latest Updates