HomeTelugu Newsసంచలనాల వర్మ మరో సంచలన మూవీ

సంచలనాల వర్మ మరో సంచలన మూవీ

12 17
అందరినీ ఆశ్చర్యపరచడంలో ముందుండే డైరెక్టర్ ఇంకెవ్వరు ఆర్జీవీ. వెంట వెంటనే సినిమాలు ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు రామ్‌ గోపాల్‌వర్మ. ఒక చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగానే ఆయన మరో చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. ఆయన తెరకెక్కించిన ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. అయితే ఆయన తాజాగా ‘ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’ సినిమాను ప్రారంభించాడు. మార్షల్‌ ఆర్ట్స్‌లో పేరుగాంచిన బ్రూస్‌లీ స్ఫూర్తిగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇండో చైనీస్‌ కో ప్రొడక్షన్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ‘భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా ఇది’ అని వర్మ తెలిపారు. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ విడుదల తేదీని వర్మ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా నవంబర్‌ 27న మధ్యాహ్నం 3.12 గంటలకు టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే డిసెంబర్‌ 13న బ్రూస్‌లీ నివసించిన చైనాలోని ఫోషన్‌ సిటీలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తామని రాంగోపాల్ వర్మ ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu