నిజమేనా.. పవన్ తో సాయేషా..?

‘అఖిల్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన ముంబై భామ సాయేషా సైగల్. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడం వలన నిర్మాతలు ఆమెపై పెద్దగా ఆసక్తి చూపలేదు.కానీ తన నటనతో, నాజూకుతనంతో యూత్ ను బాగానే ఆకట్టుకుంది. రీసెంట్ గా ‘శివాయ్’ అనే బాలీవుడ్ సినిమాలో మెరిసింది. అయితే ఇప్పుడు మళ్ళీ సాయేషాకు ఓ తెలుగు సినిమా ఆఫర్ వచ్చినట్లు టాక్.అది కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన.

పవన్ ప్రస్తుతం ‘కాటమరాయుడు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో ఓ సినిమా, అలానే తమిళ దర్శకుడు నేసన్ తో మరో సినిమా ప్లాన్ చేశాడు. త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను
ఎంపిక చేశారు. ఇప్పుడు నేసన్ సినిమాలో హీరోయిన్ గా సాయేషా ను ఎన్నుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో స్టార్ హీరోయిన్స్ ను కాదని సాయేషాను ఎన్నుకోవడం నిజమేనా..? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ విషయంపై అధికార ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే!